Mahindra 275 DI HT TU SP Plus ట్రాక్టర్
"Mahindra 275 DI HT TU SP Plus ట్రాక్టర్ ఒక బలమైన ట్రాక్టర్. ఇది హెవీ డ్యూటీకి మరియు రోజువారీ వ్యవసాయ కార్యకలాపాల కోసం 39 (29.1) కిలోవాట్ల ఇంధన-సామర్థ్యం మరియు అధిక-పనితీరు గల ఇంజిన్‌ను కలిగి ఉంది. ఈ ట్రాక్టర్ లోని అధునాతన ఫీచర్లు వెట్ ఎయిర్ క్లీనర్, ఫ్యాక్టరీ-ఫిట్ బంపర్ మరియు టో హుక్. దీని బలమైన నిర్మాణం మరియు మన్నికైన భాగాలు దీర్ఘకాల మన్నికతో పాటు అతి తక్కువ నిర్వహణ అవసరాలు మాత్రమే కలిగి ఉంటాయి. సరసమైన ధరలలో మంచి ఉత్పాదకతనిచ్చే వాటి కోసం చూస్తున్న రైతులకు ఇది ఒక నమ్మకమైన ఎంపిక. ట్రాక్టర్ యొక్క ఎర్గోనామిక్ డిజైన్ మరియు సౌకర్యవంతమైన ఆపరేటర్ స్టేషన్, అలసట లేకుండా ఎక్కువ గంటలు పనిచేయడానికి వీలు కల్పిస్తాయి. అంటే కాకుండా, ఇది రోటావేటర్లు, కల్టివేటర్లు, ట్రాలీలు మరియు రివర్సిబుల్ MB ప్లవ్ వంటి వివిధ పనిముట్లకు సరిపోతుంది. ఈ వైవిధ్యత చిన్న నుండి మధ్య తరహా పొలాల వరకు అనేక
విధాలైన వ్యవసాయ పనులకు అనుకూలంగా ఉంటుంది. మొత్తంమీద, దీని శక్తి, సామర్థ్యం, మన్నిక మరియు ఆపరేటర్ సౌకర్యాల వలన ఇది అత్యుత్తమమైన వ్యవసాయ పనుల అనుభవాన్ని అందిస్తుంది. Mahindra 275 DI HT TU SP Plus ట్రాక్టర్ తో, మీ వ్యవసాయ పనులను అప్‍గ్రేడ్ చేయండి మరియు ప్రతి సీజన్ లోను అధిక ఉత్పాదకతను పొందండి."
స్పెసిఫికేషన్లు
Mahindra 275 DI HT TU SP Plus ట్రాక్టర్- ఇంజిన్ పవర్ (kW)29.1 kW (39 HP)
- గరిష్ట టార్క్ (Nm)145 Nm
- గరిష్ట PTO శక్తి (kW)34 (25.4)
- రేట్ చేయబడిన RPM (r/min)2200
- Gears సంఖ్య8F + 2R
- ఇంజిన్ సిలిండర్ల సంఖ్య3
- స్టీరింగ్ రకంమెకానికల్ స్టీరింగ్
- వెనుక టైర్ పరిమాణం13.6*28 (34.5*71.1)
- ట్రాన్స్మిషన్ రకంపాక్షిక స్థిరమైన మెష్
- హైడ్రాలిక్స్ లిఫ్టింగ్ కెపాసిటీ (కిలోలు)1500
ప్రత్యేక లక్షణాలు
- రోటావేటర్
- కల్టివేటర్
- ట్రాలీ
- రివర్సబుల్ MB ప్లవ్