మహీంద్రా 305 ఆర్చర్డ్ ట్రాక్టర్
అన్నింటి కంటే కొత్తదైన మహీంద్రా 305 ఆర్చర్డ్ ట్రాక్టర్‌ను మీకు పరిచయం చేస్తున్నాము. ఇది పండ్ల తోటల పెంపకంలో రారాజు. 20.88 kW (28 HP) ఇంజిన్ పవర్‌తో పనిచేసే ఈ ట్రాక్టర్, ఫీల్డ్‌లో అత్యుత్తమ శక్తిని అందిస్తుంది. అలానే కంట్రోల్ చేయడానికి అనువుగా ఉంటుంది. ఈ మహీంద్రా ట్రాక్టర్‌లో 540 రేటెడ్ RPM (r/min) వేగం, 1200 కిలోల హైడ్రాలిక్స్ లిఫ్టింగ్ కెపాసిటీ ఉన్నాయి. కాబట్టి వ్యవసాయ పనులన్నింటినీ సజావుగా పూర్తి చేస్తుంది. దీని వెడల్పు 1.09 మీటర్లు కావడంతో, ఇది పండ్ల తోటల పెంపకం, ఇంటర్ కల్చర్ ఫార్మింగ్‌లో ఆరితేరిన ట్రాక్టర్‌గా నిలిచింది. అధునాతన హైడ్రాలిక్స్‌తో పాటు 3-సిలిండర్ ఇంజిన్ ఉన్న ఈ ట్రాక్టర్ పనులన్నింటినీ సులువుగా పూర్తి చేయడంతో పాటు వేగంగా, తరచుగా చేయాల్సిన టాస్క్‌లను ఎక్కువ శ్రమ లేకుండానే పూర్తి చేసే సౌకర్యాన్ని రైతులకు కల్పిస్తుంది. మహీంద్రా 305 ఆర్చర్డ్ ట్రాక్టర్‌ను మీతో పాటుగా ఫీల్డ్‌లోకి తీసుకెళ్లండి, మీ పండ్ల తోటల పెంపకాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి సిద్ధమవ్వండి.
స్పెసిఫికేషన్లు
మహీంద్రా 305 ఆర్చర్డ్ ట్రాక్టర్- ఇంజిన్ పవర్ (kW)20.88 kW (28 HP)
- గరిష్ట టార్క్ (Nm)115 Nm
- గరిష్ట PTO శక్తి (kW)18.2 kW (24.4)
- రేట్ చేయబడిన RPM (r/min)2000
- Gears సంఖ్య6 F + 2 R
- ఇంజిన్ సిలిండర్ల సంఖ్య3
- స్టీరింగ్ రకంపవర్ స్టీరింగ్
- వెనుక టైర్ పరిమాణం284.48 మిమీ x 609.6 మిమీ (11.2 అంగుళాలు x 24 అంగుళాలు)
- ట్రాన్స్మిషన్ రకంపార్షియల్ కాన్‌స్టంట్ మెష్
- హైడ్రాలిక్స్ లిఫ్టింగ్ కెపాసిటీ (కిలోలు)1200