మహీంద్రా ఎక్స్‌పీ ప్లస్ 265 ఆర్చర్డ్ ట్రాక్టర్
అన్నింటి కంటే కొత్తదైన మహీంద్రా 265 ఎక్స్‌పీ ప్లస్ ఆర్చర్డ్ ట్రాక్టర్‌ను మీకు పరిచయం చేస్తున్నాము - ఇది వ్యవసాయంలో మెగాస్టార్ వంటిది. ఈ ట్రాక్టర్‌ను దృఢంగా ఉండేలా, ఎక్కువ రోజులు పనిచేసేలా రూపొందించాము. ఇది పండ్ల తోటలలో వేగంగా, ఎప్పటికప్పుడు పనులు పూర్తి చేయాల్సిన పరిస్థితులను తట్టుకునేలా రూపొందింది. అంతేకాక 24.6 kW (33.0 HP) ఇంజిన్ పవర్, 139 Nm సుపీరియర్ టార్క్‌తో పనిచేస్తుంది. కాబట్టి చెట్ల మధ్యన ఉండే సన్నని ఖాళీల మధ్య, ఎక్కువ శ్రమ లేకుండానే, సజావుగా కదులుతుంది. అధిక ఉత్పాదకత వచ్చేలా తోటను తయారు చేయగలుగుతుంది. అధునాతన హైడ్రాలిక్స్, పవర్ స్టీరింగ్, ఇంకా 49 లీటర్ల ఇంధన ట్యాంక్ ఉన్న ఈ ట్రాక్టర్ రైతుల కలలను నిజం చేస్తుంది. దీనిలోని హైడ్రాలిక్ వ్యవస్థ అనేది కంట్రోలింగ్ చాలా ఖచ్చితంగా ఉండేలా చూస్తుంది. మీ నిర్దిష్ట వ్యవసాయ అవసరాలకు తగినట్లుగా ఉండటమేకాక, మీరు ఎప్పటికప్పుడు మార్చే పద్ధతులకు అనుగుణంగా ఎలాంటి అంతరాయాలు లేకుండా పని చేస్తుంది. శక్తి, ఖచ్చితత్వం, అనుకూలత వంటి కలయిక వల్ల ఎదురులేని ట్రాక్టర్‌గా మారిన మహీంద్రా ఎక్స్‌పీ ప్లస్ 265 ఆర్చర్డ్, మీ వ్యవసాయంలో ఉత్పాదకత, విజయాలను కొత్త శిఖరాలకు చేరుస్తుంది.
స్పెసిఫికేషన్లు
మహీంద్రా ఎక్స్‌పీ ప్లస్ 265 ఆర్చర్డ్ ట్రాక్టర్- ఇంజిన్ పవర్ (kW)24.6 kW (33.0 HP)
- గరిష్ట టార్క్ (Nm)139 Nm
- గరిష్ట PTO శక్తి (kW)22.1 kW (29.6 HP)
- రేట్ చేయబడిన RPM (r/min)2000
- Gears సంఖ్య8F + 2 R
- ఇంజిన్ సిలిండర్ల సంఖ్య3
- స్టీరింగ్ రకండ్యూయల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ్
- వెనుక టైర్ పరిమాణం284.48 మిమీ x 609.6 మిమీ (11.2 అంగుళాలు x 24 అంగుళాలు)
- ట్రాన్స్మిషన్ రకంపార్షియల్ కాన్‌స్టంట్ మెష్
- హైడ్రాలిక్స్ లిఫ్టింగ్ కెపాసిటీ (కిలోలు)1200